Chandrababu Case Updates: చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టుకు న్యాయవాదులు, ఏసీ సౌకర్యం కల్పించాలని కోర్టు ఆదేశాలు

Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్కిన్ ఎలర్జీ ఉన్నట్టు వైద్యులు చెప్పడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుని ఆశ్రయించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 14, 2023, 08:57 PM IST
Chandrababu Case Updates: చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టుకు న్యాయవాదులు, ఏసీ సౌకర్యం కల్పించాలని కోర్టు ఆదేశాలు

Chandrababu Case Updates: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వాసుపత్రి వైద్యులు విడుదల చేసిన నివేదికపై ఆందోళన పెరుగుతోంది. చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ సమస్యలున్నట్టు చెప్పడమే కాకుండా ఏసీ వాతావరణం ఉండాలని వైద్యులు చెప్పడంతో అదే అదనుగా చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టు తలుపు తట్టారు. 

ఏపీ స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యులు నివేదిక సమర్పించారు. చంద్రబాబు స్కిల్ ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు స్పష్టం చేశారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సూచనల మేరకు ఈ నెల 12వ తేదీన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల బృందం జైలులో చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించి నివేదికను సమర్పించింది. చంద్రబాబు స్కిల్ ఎలర్జీ, ఫంగల్ ఇన్‌‌క్షన్లతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. చంద్రబాబు గెడ్డం, అరచేయి, ఛాతీ, శరీరంలోని ఇతర భాగాల్లో దద్దుర్లు ఉన్నాయని, చంద్రబాబు చర్మం రంగు కూడా మారినట్టు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎండల కారణంగా చంద్రబాబు డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారని, ఏసీ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని వైద్య బృందం సూచించింది. వాస్తవానికి జైలు నిబంధనల మేరకు ఏసీలు పెట్టేందుకు వీలుకాదని జైలు అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు చూస్తామన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సూచనలు, నివేదిక ఆధారంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టుని ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో ఇందుకు సంబంధించి వాదనలు కూడా జరిగాయి. కోర్టులో వాదనల అనంతరం రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Also read: Diabetes Control Tips: ఈ చెట్టు ఆకులు రోజూ నమిలి తింటే ఇక డయాబెటిస్‌కు చెక్, ఏ మందులూ అవసరం లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News