Lakshmi Parvathi: ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కనీసం ఏడో తరగతి కూడా పాస్ కాలేదని ఆరోపించారు. అలాంటి వ్యక్తి 2 లక్షల కోట్లకుపైగా దోచుకున్నాడని తెలిపారు. కుప్పంలో అతడు సామాన్యుడి చేతిలో ఓడిపోబోతున్నారని జోష్యం చెప్పారు. గత ఎన్నికల్లో గట్టెక్కిన బాబు ఈసారి ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.
Also Read: Asaduddin Owaisi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేది అతడే.. నా మద్దతు అతడికే: అసదుద్దీన్ ఓవైసీ
కుప్పంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడారు. కుప్పంలో రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమ్మర్శలు చేశారు. సొంత నియోజకవర్గ చంద్రగిరిలో సామాన్యుడి చేతిలో ఓడిపోయి బాబు కుప్పం స్థానానికి వచ్చారని గుర్తు చేశారు. కుప్పంలో 35 ఏళ్లుగా బాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై ఉన్న 25 కేసులను పక్క దారి పట్టించుకున్నారని వివరించారు.
Also Read: Glass Symbol: ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్.. గాజు గ్లాస్ ఇతరులకు కేటాయింపు
'దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తూ వచ్చాడు. అవి తగ్గే కొద్దీ చంద్రబాబు మెజారిటీ కూడా తగ్గుతూ వచ్చింది. ప్రతి పార్టీలో చంద్రబాబుకు కోవర్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి, పురంధేశ్వరి ఆయన కోవర్టులే' అని లక్ష్మీపార్వతి ఆరోపించారు. టీడీపీలో కనీసం మొదట సభ్యత్వం తీసుకొని వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. నారా భువనేశ్వరి, పురందేశ్వరి ఈర్ష్య, ద్వేషాల వల్ల తండ్రి ఎన్టీఆర్‌ను కోల్పోయారు' అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో దోచుకునే వ్యక్తికి సరిగ్గా మాట్లాడం రాదు.. తదుపరి ముఖ్యమంత్రి లోకేశ్‌నా? లోకేశ్, చంద్రబాబుకి పవన్ తోడు అయ్యాడు. కుప్పంలో 7 సార్లు ఎమ్మెల్యే గా ఉండి ఏమి మంచి పని చేశావు? అని నిలదీశారు.
ఐటీ రంగంలో ఒక్క బిల్డింగ్ మాత్రమే వేశారు. అంతకంటే గుజరాత్ , బెంగుళూరు, మహారాష్ట్ర అప్పటికే అభివృద్ధి చెంది ఉంది. కుప్పంలో ప్రజలు సాగు నీరు,త్రాగు నీరు లేకుండా విలవిలాడుతుంటే సీఎం జగన్ అందించారు. హంద్రీనివా ద్వారా రైతులకు నీరంధించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సీఎంగా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో 200 లక్షల కోట్లు దోచుకున్నారు. సీఎం పదవి, పార్టీ అధికారి కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచి నన్ను ఇంటిని బయటకు వెళ్లగొట్టాడు. కుప్పం నియోజకవర్గంలో చాలా చిన్న వయసు ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్ చంద్రబాబుపై గెలిస్తే దేశంలో చరిత్ర సృష్టిస్తారు' అని వివరించారు.
'చంద్రబాబు తనయుడు 7వ తరగతిలో ఉత్తీర్ణత సాధించలేని వ్యక్తి. స్టాండ్ ఫర్ యూనివర్సిటీ సర్టిఫికెట్‌ను డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన వ్యక్తి నారా లోకేశ్. లోకేశ్ కొడుకుపై రూ.25 కోట్లు ఎప్పుడు సంపాదించాడు? బాబు, లోకేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి పీడించి లక్షల కోట్లు దోచుకోవడమే వారి లక్ష్యం. మీకు ప్రజాబలం, అభిమానం ఉంటే ఇతర పార్టీల పొత్తు ఎందుకు?' అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.
సీఎం జగన్ హీరో, నిజమైన ప్రజల మనిషి అని లక్ష్మీపార్వతి తెలిపారు. కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఎక్కువ ఓట్లతో కాకపోయినా చంద్రబాబుపై స్వల్ప ఓట్లతో గెలుస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రజలుగా కుప్పం ప్రజలు చరిత్రలో నిలిచిపోతారు. పొత్తులను ప్రజలు ఛీ కొడుతున్నారు. ఎన్డీయే కూటమి మేనిఫెస్టో కాదు. ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఫోటో కూడా లేదు. ఎన్డీయే కూటమి మేనిఫెస్టోను బీజేపీ ఇన్‌చార్జ్ కనీసం తాకలేదు' అని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter