CBI Notices: ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేసిన సీబీఐ, ఈసారి 41ఏ ప్రకారం

CBI Notices: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి చిక్కులు తప్పేట్టు లేవు. ఈసారి సీబీఐ 41 ఏ కింద మరోసారి నోటీసులు జారీ చేసింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2023, 07:02 PM IST
  • మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ నోటీసులు
  • ఈసారి సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులిచ్చిన సీబీఐ
  • జనవరి 28న హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి రావాలంటూ నోటీసులు
CBI Notices: ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేసిన సీబీఐ, ఈసారి 41ఏ ప్రకారం

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చనీయాంశమౌతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అవినాష్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా భావించడం గమనార్హం.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిగా ముందు అంటే 2019 మార్చ్ 15వ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై అప్పటి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక మరో టీమ్ ఏర్పాటు చేసింది. అనంతర పరిణామాల్లో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి ఈ కేసులో కడప అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. 

తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణకు ఈనెల 24న హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అతని పీఏకు నోటీసులు సర్వ్ చేసింది సీబీఐ. అదే రోజు అంటే జనవరి 23వ తేదీన నోటీసులపై అవినాష్ రెడ్డి స్పందించారు. అంత హఠాత్తుగా నోటీసులిచ్చి హాజరవమంటే ఎలా అని ప్రశ్నించారు. షెడ్యూల్ కార్యక్రమాలున్నందున హాజరుకాలేనని..5 రోజుల తరువాత ఎప్పుడైనా హాజరవుతానని స్పష్టం చేశారు. 

దాంతో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈసారి 41 ఏ కింద నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈనెల అంటే జనవరి 28వ తేదీన హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి రావాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఆ తరువాత షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి 41 ఏ కింద నోటీసులివ్వడం ఆసక్తి రేపుతోంది. ఈసారైనా అనినాష్ రెడ్డి విచారణకు హాజరౌతారా లేదా అనేది చూడాలి.

41A నోటీసు అంటే

సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. సంబంధిత వ్యక్తికి ఆ నేరంలో భాగముందనే విశ్వసనీయ సమాచారం లేదా అనుమానాలున్నప్పుడు ఆ వ్యక్తిని విచారణ కోసం హాజరవాలని కోరుతూ ఈ నోటీసు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న వ్యక్తి విధిగా విచారణకు హాజరు కావాలి. ఆ వ్యక్తి నోటీసుకు కట్టుబడితే ఆ నేరానికి సంబంధించి అరెస్టు చేయకూడదు. 

ఎప్పుడు అరెస్టు చేయవచ్చు

నోటీసు అందుకున్న వ్యక్తి మరే ఇతర సీరియస్ నేరానికి పాల్పడతాడని లేదా పారిపోతాడని లేదా సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడని ఇలా ఐదు కారణాలు బలంగా ఉంటేనే రాతపూర్వకంగా రాసిచ్చి అరెస్టు చేయవచ్చు. నోటీసులో ఇచ్చిన షరతులకు ఆ వ్యక్తి కట్టుబడితే మాత్రం అరెస్టు చేయలేరు.

Also read: Pawan Kalyan: పవన్ పర్యటనలో 108 అంబులెన్స్ సైరన్.. వెంటనే వాహనాలు నిలిపివేసి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News