నీటి ఒరవడికి భిన్నంగా వెళ్లి మునిగిన బోటు

కృష్ణానది‌లో పవిత్ర సంఘమం వద్ద బోటు బోల్తా పడి 16 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉన్నత దర్యాప్తు జరుగుతోంది. పడవ మునిగిన ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నాడో ఒక్కసారి తెలుసుకుందాం....

Last Updated : Nov 13, 2017, 11:56 AM IST
నీటి ఒరవడికి భిన్నంగా వెళ్లి మునిగిన బోటు

విజయవాడ: కృష్ణానది‌లో పవిత్ర సంఘమం వద్ద బోటు బోల్తా పడి 16 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉన్నత దర్యాప్తు జరుగుతోంది. పడవ మునిగిన ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నాడో ఒక్కసారి తెలుసుకుందాం....

రివర్ బోటు ఎడ్వెంచర్స్‌కు చెందిన ఒక బోటు పర్యాటకులతో విజయవాడ నుంచి రావడం చూశామని ఓ మత్య్కకారుడు వెల్లడించాడు... అలా వస్తున్న బోటు నీటి ఒరవడికి పూర్తి భిన్నంగా ప్రయాణిస్తోందని...ఇంతలో ఒక్కసారిగా అది ఊగిపోవడం ప్రారంభించిందని..అయితే ప్రయాణికులు హారతి దృశ్యాన్ని చూసి.. ఉత్సాహంగా బోటును ఊపుతున్నారేమోనని భావించామన్నాడు. ఆ సమయంలో తమ బోటులో ముగ్గురు పర్యాటకులు ఉండడంతో వారిని దించేసేందుకు వెళ్తున్నామని ఆ మత్స్యకారుడు వెల్లడించాడు.

ఇంతలో ఒక్కసారిగా హాహాకారాలు వినిపించాయని... వెనక్కి తిరిగి చూసేసరికి బోటు బోల్తా పడిపోయిందని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైందన్నాడు. వెంటనే వెనక్కి వెళ్లడం మానేసి..దగ్గర్లోని మరో మూడు బోట్లలో ఉన్న స్నేహితులతో.. 'ఒరేయ్!  బోటు బోల్తాపడింది పదండ్రా'...! అని గట్టిగా అరుస్తూ ముందుకు వెళ్లానని ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఆ మత్స్యకారుడు తెలిపాడు.

Trending News