AP Elections 2024: జనసేన, టీడీపీకి బీజేపీ ఝలక్..? ఏపీలో ఒంటరిగా ఎన్నికలకు సిద్ధం..!

AP Assembly Elections 2024: ఏపీలో టీడీపీతో పొత్తుపై బీజేపీ ఏం ఆలోచిస్తోంది..? కలిసి వెళతారా..? విడిగా పోటీ చేస్తారా..? ఒక వేళ పొత్త వద్దనుకుంటే.. జనసేనను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా..? ఇప్పుడివే ప్రశ్నలు బీజేపీలోనే కాదు.. టీడీపీ, జనసేన నేతల్లోనూ వ్యక్తమవుతున్నాయి. బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు త్వరలో చోటు చేసుకోబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంటోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 10, 2024, 11:37 PM IST
AP Elections 2024: జనసేన, టీడీపీకి బీజేపీ ఝలక్..? ఏపీలో ఒంటరిగా ఎన్నికలకు సిద్ధం..!

AP Assembly Elections 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు సీఎం జగన్ సింగిల్‌గా సిద్ధమవుతున్నారు. వై నాట్ 175 టార్గెట్‌తో పావులు కదుపుతున్నారు. మరోవైపు షర్మిల రూపంలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు వస్తోంది. హస్తం పార్టీని మళ్లీ ట్రాక్‌లో తెచ్చేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. తమతో బీజేపీ కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నాయి. కానీ బీజేపీ నుంచే స్పందన కరువైంది. జనసేనతో కలిసే వెళతామంటూ పదే పదే చెబుతున్న కమలనాథులు.. టీడీపీతో పొత్తు విషయంలో ఏం మాట్లాడటం లేదు. అయితే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా బీజేపీ నుంచి తుది నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. 

బీజేపీ రాష్ట్ర నాయకుల నుంచి ఇప్పటికే ఆ పార్టీ అగ్ర నాయకత్వం పొత్తులపై అభిప్రాయ తీసుకుంది. పొత్తులపై నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎక్కువ మంది నేతలు పొత్తుతో వెళ్దామని సూచించినట్లు తెలుస్తోంది. అన్ని రిపోర్టుల ఆధారంగా ప్రధాని మోదీ ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.  

బీజేపీతో పొత్తు విషయంపై టీడీపీలో కూడా కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. కమలం పార్టీతో పొత్తుతో వెళ్లటం ద్వారా కొన్ని వర్గాల ఓటింగ్ దూరమవుతామని చంద్రబాబుతో ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మద్దతు లేకుండా జగన్‌ను ఎదుర్కొలేమని పార్టీ మరికొందరు నేతలు అంటున్నారు. ఎన్నికల తరువాత ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

తాజాగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పార్టీ జాతీయ కార్యదర్శి  సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై నిర్ణయం ఎలా ఉన్నా.. తాము మాత్రం ఎన్నికలకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు. పార్టీ నాయకత్వ సూచనల మేరకు ముందుకు వెళుతున్నామన్నారు. అయితే జనసేన-టీడీపీ కూటమిపై ఆయన కామెంట్స్ చేయలేదు. బీజేపీ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ బలోపేతం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడంతో బీజేపీ ఒంటరిగా కూడా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ప్రతీ గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తరువాత రాజకీయంగా ప్రధాని మోదీ నిర్ణయాలు ఉంటాయని.. ఏపీలో పొత్తులపైన క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News