TDP Janasena Alliance: పవన్ కళ్యాణ్‌కు బీజేపీ టెంప్టింగ్‌ ఆఫర్.. టీడీపీకి బిగ్‌ ట్విస్ట్..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సంచలన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్‌తో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఒక పార్టీతో మరో పార్టీ చర్చించకుండా చెరో స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.    

Written by - Ashok Krindinti | Last Updated : Jan 26, 2024, 11:22 PM IST
TDP Janasena Alliance: పవన్ కళ్యాణ్‌కు బీజేపీ టెంప్టింగ్‌ ఆఫర్.. టీడీపీకి బిగ్‌ ట్విస్ట్..!

Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు వైసీపీలో అసమ్మతి సెగలు చెలరేగుతుండగా.. టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో క్వశ్చన్ మార్క్‌గా మారింది. ఇటు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్‌ వరించడం... టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌తో చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్‌కు బీజేపీ  టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు.. ఆంధ్ర పాలిటిక్స్‌ను మలుపు తిప్పే రాజకీయం తెరపైకి వచ్చిందని సమాచారం. బీజేపీ అధిష్టానం నుంచి పవన్‌కు స్పష్టమైన డైరెక్షన్‌ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పవన్‌ను ఢిల్లీకి పిలిపించి.. పొత్తుల విషయంపై చర్చలు జరపనున్నారు.

జనసేనతో సంప్రదించకుడా అరకు, మండపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ విషయంపై జనసేన నాయకులు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. పొత్తులో ఉన్నప్పుడు చర్చలు జరపకుండా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని.. మనం కూడా అభ్యర్థులను ప్రకటిద్దామని ఒత్తిడి చేశారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఉన్న ఒత్తిడితో అభ్యర్థులను ప్రకటించారని.. తనకు కూడా ఉన్న ఒత్తిడి కారణంగా రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజోల్, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని.. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చన్నారు. లోకేష్‌ ముఖ్యమంత్రి పదవిపై తాను మాట్లాడినా మౌనంగా ఉన్నానని అన్నారు. 

ఇన్నాళ్లు పొత్తుతోనే పోటీలోకి దిగుతామని ప్రకటించిన టీడీపీ-జనసేన.. ఇలా సడెన్‌గా ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించడం కలవరం చెలరేగుతోంది. పవన్‌కు బీజేపీ నుంచి డైరెక్షన్‌ వచ్చిందని.. అందుకే టీడీపీపై విమర్శలు చేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీతో కాకుండా జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొన్ని సీట్లు గెలిచినా.. వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ అధిష్టానం పవన్‌తో చెప్పే అవకాశం ఉంది.

ముందుగా చిరంజీవికి జనసేన నుంచి రాజ్యసభ సీటు ఇవ్వడం.. ఆ తర్వాత కేంద్రమంత్రి పదవి ఇవ్వడం.. జనసేనలో చేరిన తర్వాత ముద్రగడ పద్మనాభంకు గవర్నర్ పదవి ఇవ్వడం లాంటి సంచలనాల విషయాలపై పవన్‌ కళ్యాణ్‌తో బీజేపీ చర్చలు జరిపిందేకు సిద్ధమవుతోందని సమాచారం. కాకినాడలో 5 లక్షల మందితో జనసేనలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధమవుతున్నారు. మరి టీడీపీతో కలిసి వెళ్తే కాపులకు వచ్చే లాభం ఏంటి..? రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ భవిష్యత్ ఏంటి..? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాపు ఓటు బ్యాంక్‌తో బీజేపీ-జనసేన ఎన్నికలకు వెళ్లాలని ప్రపోజల్ రానుంది. లేదంటే టీడీపీ-జనసేన కలిసి ఉంటే.. బీజేపీ కూడా కూటమిలో చేరాలా..? లేదంటే బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాలా..? అనే విషయంపై కూడా కమలం దళంలో చర్చ జరుగుతోంది.

Also Read: KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు

Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News