Sea Disappeared: దేశంలో సముద్ర తీరం ఎక్కువగా గల రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సముద్ర ఎగుమతులు ఏపీ నుంచే ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ కోస్తా తీరం..అందమైన పల్లెలకు, బీచ్ లకు ప్రసిద్ధి. మత్స్యకారులకు జీవనాధారమైన సముద్రంలో గత కొన్ని రోజులుగా విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా (East Godavari) అంతర్వేదిలో సముద్రపు అలలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రం(Sea) పెద్ద పెద్ద అలలతో ముందుకు రావడం.. అనంతరం వెనక్కి వెళ్లిపోవడంతో కలకలం రేగుతోంది. అంతర్వేది(Antarvedi) తీరంలో సముద్రం ఏకంగా 2 కిలోమీటర్లు వెనక్కివెళ్లింది. గోదావరి నది (Godavari River) బంగాళాఖాతం(Bay of Bengal)లో కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. సఖినేటిపల్లి మండలంలో అంతర్వేది(Antarvedi) తీరంలో సాధారణంగా అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి. నిత్యం సముద్రం ముందుకు చొచ్చుకొస్తూ స్థానికంగా ఉన్న దుకాణాలు, ఇళ్లను ముంచేస్తుంటుంది. బుధవారం కూడా అలలు ముందుకొచ్చి ఓ హోటల్ ను ముంచెత్తాయి. దీంతో అది ధ్వంసమైంది. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో స్థానికులంతా భయాందోళనకు గురై అటువైపు వెళ్లడం మానేశారు.
Also Read: Odisha: భార్య చితిలో దూకిన భర్త... ఒడిశాలో పతీసహగమనం
అయితే గురువారం ఉదయం తీరప్రాంతానికి వెళ్లిన వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది.నిన్న ఎగసిపడిన అలలు ఈరోజు మాయమయ్యాయి. ఆ మాటకొస్తే అక్కడ సముద్రం లేదు. కేవలం ఇసుక మేటలు మాత్రమే కనిపిస్తున్నాయి. సముద్రం(Sea) 100 కాదు 200 మీటర్లు కాదు ఏకంగా 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. ఐతే ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలో మాత్రం సముద్రపు నీరు ముందుకు చొచ్చుకొచ్చింది. గత నెలరోజులుగా అమావాస్య, పౌర్ణమి సమయాల్లో ఆటపోట్లకు గురయ్యే సముద్రం 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం కలకలం రేపుతోంది. ఈ అనూహ్య మార్పులకు కారణాలేంటో తేల్చాలని అధికారులకు విన్నవిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook