Balakrishna: టీడీపికీ ఊపు తెచ్చేందుకు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్ర.. ఆ రోజు నుంచి మొదలు..

Balakrishna: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీలో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఊపు తెచ్చేందకు బాలయ్య టీడీపీ సైకిల్ రావాలి యాత్ర చేపట్టనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2024, 02:42 PM IST
Balakrishna: టీడీపికీ ఊపు తెచ్చేందుకు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్ర.. ఆ రోజు నుంచి మొదలు..

Balakrishna: ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార వైయస్‌ఆర్సీపీని గద్దే దింపేందకు ప్రధాన ప్రతిపక్షం దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేనతో కూటమిగా బరిలో దిగుతున్నారు. అంతేకాదు తిరిగి అధికారం నిలబెట్టుకునేందకు వై.యస్. జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా  చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీలో కీలకనేతగా ఉన్న చంద్రబాబు బామ్మర్ధి కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్రను చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 14, 15 వ తేదిల్లో నంద్యాల జిల్లాలోని నంద్యాల, బనగాన పల్లె, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్టూరు నియోజవర్గాల్లో బాలయ్య సైకిల్ రావాలి యాత్ర చేపట్టనున్నారు. పైగా బాలయ్యకు రాయలసీమలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అక్కడ ఆయన సినిమాలు యేళ్లకు యేళ్లు ఆడిన సందర్భాలున్నాయి. ముందు నుంచి బాలయ్య సినిమాలకు రాయలసీమ పెట్టని కోట. పైగా రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అక్కడ ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ప్రస్తుతం ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కూడా ఒకపుడు బాలయ్య కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేసారు.

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ వీక్ ఉన్నది రాయలసీమ జిల్లాల్లోనే అని చెప్పాలి. అందుకే బాలయ్యకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయలసీమ నుంచే ఆయన సైకిల రావాలని యాత్రను ప్లాన్ చేసారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక హీరోగా క్రౌడ్ పుల్లర్ అయిన బాలకృష్ణ పర్యటనలతో రాయలసీమలో పార్టీ పునర్వైభవం సాధిస్తుందనే నమ్మకంతో టీడీపీ కార్యకర్తలున్నారు. బాలయ్య 2014, 2019లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటి సారి టీడీపీ అధికారంలో  వస్తే.. రెండో సారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు మోపారు. ముచ్చటగా మూడోసారి బాలయ్య హిందూపురం నుంచి గెలవడం లాంఛనమే అని చెప్పాలి. వైసీపీ హవాలో కూడా హిందూపురం నుంచి గెలిచి చరిత్ర సృష్టించిన ఈయన ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించడం నల్లేరు మీద నడకే అని చెప్పాలి.

బాలయ్య సినిమాల విసయానికొస్తే.. గతేడాది 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అటు ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్‌లతో బాలయ్య సినిమాలున్నాయి. మరోవైపు ఎన్నికల తర్వాత 'అన్‌స్టాపబుల్ సీజన్ 4'  త్వరలో స్టార్ట్ చేయనున్నట్టు నిన్న ఉగాది సందర్భంగా ప్రస్తావించారు.

Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News