Andhra Pradesh: టీడీపీ కొత్త రథసారధిగా అచ్చెన్నాయుడు..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (TDP) కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల మధ్య కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.

Last Updated : Sep 22, 2020, 02:44 PM IST
Andhra Pradesh: టీడీపీ కొత్త రథసారధిగా అచ్చెన్నాయుడు..!

Atchannaidu Kinjarapu is the new president of AP TDP?: అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల మధ్య కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం. కళా వెంకట్రాయవు స్థానంలో.. టీడీటీ (TDP) సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Atchannaidu Kinjarapu) కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై టీడీటీ గళాన్ని వినిపిస్తున్న అచ్చెన్నాయుడుకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని అధినేత చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఈ నెల 27న ఏపీ టీడీపీ పార్టీ కొత్త కమిటీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. Also read: MPs suspension: సమావేశాలను బహిష్కరించిన విపక్ష పార్టీలు

అయితే.. ప్రస్తుతం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో మళ్లీ బీసీకే పట్టం కట్టేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే  ఇప్పటికే పార్లమెంట్ పార్టీ కొత్త కమిటీలను నియమిస్తున్న పార్టీ అధిష్టానం.. వైఎస్సార్ సీపీ (YSRCP) కి ధిటుగా నిలబడే వ్యక్తిని రథసారధిగా నియమించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి 70 రోజులు ఉన్నారు. అంతేకాకుండా తనను అక్రమంగా ఇరికించారంటూ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఏపీలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో వైసీపీ వ్యూహాలకు దీటుగా స్పందించే వ్యక్తిని నియమించేందుక చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు.  Also read: Rajya Sabha: క్షమాపణ చెబితే అవమానించారు: ఎంపీ ఆవేదన

Trending News