APSRTC bus accident today live updates: అమరావతి: ఏపీలో జరిగిన ఎపీఎస్ ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదం ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు పడిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan)... మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Ex-gratia in APS RTC Bus accident) అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సకాలంలో సరైన వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
Also read : AP Special Status: ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో గళమెత్తిన వైసీపీ ఎంపీలు
ఏపీఎస్ ఆర్టీసీ బస్సు (APSRTC bus accident at Jangareddygudem) వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నా రావు సహా 9 మంది చనిపోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు నీళ్లలో పడటంతో అందులోంచి బయటకు రావడానికి వీల్లేక, ఊపిరి ఆడకే ఆ తొమ్మిది మంది ప్రాణాలు విడిచారని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు.
Also read : Omicron Cases In Telangana: తెలంగాణలో మూడు ఒమిక్రాన్ కేసులు.. ఏడేళ్ల చిన్నారికి పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook