బీజేపీ నేత లక్ష్మీపతి APMSDIC పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తన రాజీనామా లేఖను అందించారు. మోడీ కేబినెట్ నుంచి టీడీపీ వైదొలగడం..చివరకు ఎన్డీయే కూటమి నుంచి కూడా బయటికి రావడం వంటి పరిణామాలతో వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా పని చేసిన లక్ష్మీపతి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా లక్షీపతి మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ సంబంధాలను తెంచుకున్నప్పుడు తాను ఈ పదవిలో కొనసాగడం భావ్యం కాదనే ఉద్దేశంతో తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చాలా చేసిందని.. అయితే ఈ విషయాలు పక్కనపెట్టి రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసిందో వివరిస్తానని పేర్కొన్నారు.