IMD Heavy Rains Alert: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు త్వరగానే దేశంలో ప్రవేశించినా జూన్ మొదటి వారం నుంచి స్తబ్దుగా మారిపోయాయి. ఫలితంగా జూన్‌లో ఇప్పటి వరకూ ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. ఇప్పుడు తిరిగి నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారడంతో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
జూన్ నెలంతా సరైన వర్షపాతం లేకుండానే ముగిసిపోతోంది. నైరుతి రుతు పవనాలు త్వరగా ప్రవేశించినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకూ నిస్తేజంగా ఉన్న నైరుతి రుతు పవనాల్లో ఇప్పుడు చురుకుదనం కన్పిస్తోంది. వేగంగా విస్తరిస్తున్నాయి. దీనికితోడు పశ్చిమం, నైరుతి నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఇవాళ్టి నుంచి మూడ్రోజులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
ఇవాళ, రేపు పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరి కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. వర్షాలకు తోడు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. అటు విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల, కడప, సత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదమున్నందున రైతులు , కూలీలు, పొలాల్లో లేదా చెట్ల కిద ఉండవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.
ఏపీలో పలు జిల్లాల్లో కురిసిన వర్షపాతం
అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నిన్న మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 5.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 4.7 సెంటీమీటర్లు, విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో 4.5 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా హరిపురంలో 4.5 సెంటీమీటర్లు, కాకినాడ జిల్లా డి పోలవరంలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
Also read: ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook