Hero Vishal: కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ? క్లారిటీ ఇచ్చిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి..

Hero Vishal:కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. వైసీపీ హవా వీచినా గత ఎన్నికల్లో చంద్రబాబుకు భారీ మెజార్టీనే వచ్చింది.టీడీపీ కంచుకోటగా చెప్పుకునే కుప్పంలో గెలుస్తామని జగన్ ఎలా చెబుతున్నారు.. కుప్పంపై ఆయన వ్యూహం ఏంటీ అన్న చర్యలు తెరపైకి వచ్చాయి.  

Written by - Srisailam | Last Updated : Jul 1, 2022, 08:22 AM IST
  • కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ?
  • విశాల్ పోటీపై సోషల్ మీడియాలో ప్రచారం
  • విశాల్ పోటీపై క్లారిటీ ఇచ్చిన పెద్దిరెడ్డి
Hero Vishal: కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ? క్లారిటీ ఇచ్చిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి..

Hero Vishal:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అధికార, విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి బంపర్ విక్టరీ కొట్టిన వైసీపీ.. మరోసారి అధికారం కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్.. కుప్పంలో గెలవబోతున్నామని చెప్పడం సంచలనంగా మారింది. కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. వైసీపీ హవా వీచినా గత ఎన్నికల్లో చంద్రబాబుకు భారీ మెజార్టీనే వచ్చింది.టీడీపీ కంచుకోటగా చెప్పుకునే కుప్పంలో గెలుస్తామని జగన్ ఎలా చెబుతున్నారు.. కుప్పంపై ఆయన వ్యూహం ఏంటీ అన్న చర్యలు తెరపైకి వచ్చాయి.

కుప్పంలో చంద్రబాబుపై బలమైన అభ్యర్థిని జగన్ రెడీ చేశారని.. తమిళ స్టార్ హీరో విశాల్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. విశాల్ స్వగ్రామం కుప్పం నియోజకవర్గంలోనే ఉంది. వైఎస్ జగన్ తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కుప్పంలో తమిళ ఓటర్లు భారీగా ఉన్నారు. అందుకే కుప్పంలో విశాల్ ను బరిలోకి దింపి చంద్రబాబుకు చెక్ పెట్టాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారనే వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వైసీపీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. కుప్పంలో చంద్రబాబుపై హీరో విశాల్ పోటీపై చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కుప్పంలో  వైసీపీ అభ్యర్థి పై పెద్దిరెడ్డి చేసిన కామెంట్లు ఆసక్తిగా మారాయి.

ఏపీలో వైసీపీ గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తోంది. అధికార పార్టీ ప్రజానిధులు ఇంటిఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తున్నారు. కుప్పంలో నియోజకవర్గంలో నిర్వహించిన గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి.. కుప్పం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారని చెప్పారు. భరత్ ప్రస్తుతం కుప్పం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నారు.గత ఏడాగే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు సీఎం జగన్. భరత్ నేతృత్వంలోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. ఏకంగా కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకే భరత్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భరతే పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. గతంలో భరత్ తండ్రి చంద్రమౌళి వైసీపీ అభ్యర్థిగా రెండు సార్లు చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రకటనతో కుప్పంలో హీరో విశాల్ గా పోటీ చేస్తారనే వార్తలకు చెక్ పడిందని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబును కుప్పంలో ఓడించాలనే కసితో ఉన్న సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చనే వాదన కూడా కొందరు చేస్తున్నారు.

Read also: TS TET 2022: ఇవాళ తెలంగాణ టెట్ ఫలితాలు రిలీజ్... త్వరలో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News