చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓ రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 25, 2021, 03:22 PM IST
చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓ రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని(Kodali Nani)మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాజకీయాల కోసం భార్యను రోడ్డుకు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు మాదిరిగానే లోకేష్ వ్యవహరిస్తున్నారని..రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. చంద్రబాబు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని..అసెంబ్లీ వదిలేసి కుంటిసాకులతో బయటకెళ్లిపోయారన్నారు. భువనేశ్వరి పరువు దిగజార్చింది చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసేనని చెప్పారు. వరదల్లో బాధితుల పరామర్శకు వెళ్లి..అవమానించారని ఏడుపు లంకించుకుంటున్నారని మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. 

మరోవైపు వరద నష్టాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap ys jagan)తక్షణం స్పందించారని కొడాలి నాని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

Also read: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం, సీమకు భారీ వర్షాలు తప్పవా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News