Kodali Nani Comments: ఆ నలుగురి కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదంటున్న కొడాలి నాని

Kodali Nani Comments: టాలీవుడ్ వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే..మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నలుగురి గురించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. కొడాలి నాని చెబుతున్న ఆ నలుగురు ఎవరు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2021, 02:14 PM IST
Kodali Nani Comments: ఆ నలుగురి కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదంటున్న కొడాలి నాని

Kodali Nani Comments: టాలీవుడ్ వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే..మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నలుగురి గురించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. కొడాలి నాని చెబుతున్న ఆ నలుగురు ఎవరు..

ఏపీలో గత కొద్దిరోజులుగా సినీ పరిశ్రమ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. అనేక చర్చలు , సమావేశాలు జరుగుతున్నాయి. సినీ పెద్దలు కొందరు ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంటే..మరికొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమా టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో(Online Tickets Issue) విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయానికే ఎక్కువగా మద్దతు లభిస్తోంది. చిరంజీవి మేనల్లుడు సాయిథరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఆడియో రిలీజ్ సందర్బంగా జనసేన అధినేత వవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అనంతరం సినిమా ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతలు, ఫిలిం ఛాంబర్‌లు పవన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని..తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన పరిస్థితి. 

ఈ నేపధ్యంలో అప్పట్నించి వైసీపీ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరికి మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) ప్రభుత్వ పెద్దలు మాటల దాడి చేస్తున్నారు. అదే సమయంలో మంత్రి కొడాలి నాని(Kodali Nani)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు నిర్మాతలు, నలుగురు హీరోల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని కొడాలి నాని స్పష్టం చేశారు. అందరి సంక్షేమం పరిగణలో తీసుకుంటామన్నారు. అందరి ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని గుర్తు చేశారు. ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుతామంటే కుదరదన్నారు. వైఎస్ జగన్ భయపడే వ్యక్తి కాదని..జీవితకాలంలో కూడా జగన్‌ను ఎవరూ భయపెట్టలేరని కొడాలి నాని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌కు(Ap cm ys jagan) ప్రజల మద్దతు ఉందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు.

Also read: YS Jagan Target 2024: 2024 అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ జగన్ టార్గెట్ సిద్ధమైందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News