ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం: ఆ కేసు సీబీఐకి అప్పగింత, ఇరకాటంలో వైస్సార్సీపీ....

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఏపీ సీఎం జగన్ బాబాయ్ అయిన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యా కేసుపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హై కోర్ట్ ఆదేశించింది. కాగా వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, TDP

Last Updated : Mar 11, 2020, 05:05 PM IST
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం: ఆ కేసు సీబీఐకి అప్పగింత, ఇరకాటంలో వైస్సార్సీపీ....

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఏపీ సీఎం జగన్ బాబాయ్ అయిన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యా కేసుపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్ట్ ఆదేశించింది. కాగా వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత,  తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వేసిన పిటిషన్లను హైకోర్టులో విచారణ చేపట్టగా, ఇప్పుడైనా న్యాయం జరిగి ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Also Read: కమల దళంలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల  (AP Local Bodies Elections) ఎన్నికల నేపథ్యంలో మాచర్ల లో బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై వైసీపీ నేతలే దాడి చేశారని టీడీపీ నేతలు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా నరసరావుపేటలో నామినేషన్ వేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, ఆర్డీఓ ఆఫీస్ వద్ద నరసరావుపేట టీడీపీ సమన్వయకర్త అరవిందబాబుపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు.  

Read Also:  కాంగ్రెస్‌లో అవినీతి పెరిగిపోయింది- జ్యోతిరాదిత్య సింధియా

మరోవైపు రాష్ట్రలో  వైయస్‌ఆర్‌సీపీ  నాయకులు మద్యాన్ని మంచినీళ్లలా పారిస్తున్నారని, పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని, ఈ రోజు   శ్రీకాకుళం జిల్లా టెక్కలి మెలియపుట్టి రోడ్ లో పోలీస్ నిఘా లో సంత బొమ్మాలి వైస్సార్సీపీ నేత కుమారుడు మెలియపుట్టిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వ్యక్తి పర్లాకిమిడి నుండి 459 మద్యం సీసాలతో పట్టుబడడం సిగ్గుచేటని వాపోయారు. ఎన్నికల సంఘం తక్షణమే  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: వారికి బీఫామ్‌లు ఇచ్చేదే లేదు: వైస్సార్సీపీ

కాగా వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని అన్నారు. ఎన్నికల సంఘం స్పందించి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Also Read: దిగొచ్చిన పెట్రో ధరలు 

Trending News