AP LAWCET PGLCET Round 2 Results: ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (LAWCET), పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET)-2023 రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్ అధికారిక వెబ్సైట్ lawcet-sche.aptonline.in ను సందర్శించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తమకు కేటాయించిన కాలేజీలకు కౌన్సెలింగ్ టైమ్‌టేబుల్‌కు అనుగుణంగా అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ నెల 5వ తేదీలోపు రిపోర్ట్ చేయాలి.
AP LAWCET కౌన్సెలింగ్ రెండో రౌండ్ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ డిసెంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 23న ముగిసింది. అనంతరం డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. డిసెంబరు 27 నుంచి డిసెంబర్ 29 వరకు ఎంపిక ప్రక్రియ జరిగింది. రెండో దశ కౌన్సెలింగ్ నోటీసులో అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేవలం సీటు కేటాయింపు మాత్రమే ఉంటుందని.. అడ్మిషన్‌కు గ్యారంటీ ఉండదని పేర్కొంది. అడ్మిషన్ ప్రక్రియను ఖరారు చేసేందుకు అర్హత ప్రమాణాలు నిర్దేశించింది. అభ్యర్థులు ప్రత్యేక డొమైన్ హెల్ప్లైన్లను convenerhelpdesk2023@gmail.com లేదా 9100998071 నంబరులో సంప్రదించవచ్చు. టెక్నికల్ డౌట్స్ విషయంలో స్పెషల్ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంది. అభ్యర్థులు 9154072137 నంబరులో టెక్నీకల్ టీమ్‌ను సంప్రదించవచ్చు.
మాస్టర్ ఆఫ్ లాస్ అర్హత ఇలా..
LLM (మాస్టర్ ఆఫ్ లాస్) కోర్సు కోసం అభ్యర్థులు తప్పనిసరిగా LLB పూర్తి చేసి ఉండాలి. OC/BC/SC/ST అభ్యర్థులు లాలో 3/5 ఏళ్ల డిగ్రీని కలిగి ఉండాలి. అడ్మిషన్ పొందేందుకు అభ్యర్థులు AP PGLCET (ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కి అర్హత సాధించి.. పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి ఉండాలి.
Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter