ఏపీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై త్వరలో స్పష్టత, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

AP High Court: ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై స్టే ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై ఇప్పుడు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 5, 2021, 08:44 PM IST
ఏపీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై త్వరలో స్పష్టత, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

AP High Court: ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై స్టే ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై ఇప్పుడు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

ఏపీలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ హైకోర్టు(Ap High Court) ఆదేశాలతో నిలిచిపోయింది. కౌంటింగ్‌కు అనుమతివ్వాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున నిరంజన్ రెడ్డి వాదనలు విన్పించారు. 2021 జనవరి 8 నుంచి మార్చ్ 10 వరకూ సుప్రీంకోర్టు చెప్పిన 4 వారాల ఎన్నికల నియమావళి పూర్తయిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. 

ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించామని..తీరా ఎన్నికలైన తరువాత కౌంటింగ్‌పై స్టే ఇవ్వడం సరైంది కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 4 వారాల కోడ్ అప్పటి ఎస్ఈసీ(SEC) అమలు చేయలేదని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు కేవలం 22 రోజులు మాత్రమే కోడ్ అమలు చేశారన్నారు. అదే సమయంలో ఏ పార్టీ కూడా 4 వారాల గడువు కోరలేదన్నారు. ఏ ఒక్కరు కూడా కోర్టుకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఏప్రిల్ 8న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌(Zptc Elections Counting)పై త్వరలో స్పష్టత రానుంది. 

Also read: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News