ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )లో కరోనా వైరస్ ( Corona virus ) కేసుల సంఖ్య మరింతగా తగ్గింది. కోవిడ్ 19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది.
కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా ఇంకా వణికిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ( Corona second wave ) , థర్డ్ వేవ్ లు ప్రారంభమైన పరిస్థితి. ముఖ్యంగా ఉత్తరాదిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఏపీ ( AP ) లో మాత్రం కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కరోనా వైరస్ ప్రారంభమైనప్పటినుంచి కరోనా నిర్ధారణ పరీక్షలపైనే దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) రోజుకు 80 వేల పరీక్షల్ని చేస్తోంది.
గత 24 గంటల్లో 85 లక్షల 87 వేల 312 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కేవలం 2 వేల 367 కొత్త కేసులు మాత్రమే వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 85 లక్షల 38 వేల 363కు చేరుకోగా..కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8 లక్షల 12 వేల 517 ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 21 వేల 434 మాత్రమే ఉండటం గమనించాల్సిన అంశం. రోజుకు 80-85 వేల చొప్పున పరీక్షలు చేస్తున్నా...కొత్త కేసుల సంఖ్య 2 వేల 5 వందల లోపే ఉండటం విశేషం. కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తుందని దీని ద్వారా అర్ధమౌతోంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 11 మంది మరణించగా..మొత్తం 6 వేల 779 మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: AP: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం, జనవరికి సిద్ధం