AP Budget Session: కోవిడ్ నియంత్రణలో ఏపీ దేశానికే ఆదర్శం

AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బడ్జెట్, కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం, ప్రభుత్వం విధానాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విధానాల్ని ప్రశంసించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2021, 09:55 AM IST
AP Budget Session: కోవిడ్ నియంత్రణలో ఏపీ దేశానికే ఆదర్శం

AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బడ్జెట్, కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం, ప్రభుత్వం విధానాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విధానాల్ని ప్రశంసించారు. 

కరోనా మహమ్మారిని (Corona Pandemic) ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( Biswabhushan Harichandan) కొనియాడారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల(Ap Assembly Budget Session)ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెల నుంచి కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని..ఇటు ఏపీలోనూ ఆ ప్రభావం అధికంగా ఉందన్నారు. కరోనాపై అలుపెరుగక పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్ చేశారు. కొత్తగా రాష్ట్రంలో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారని..ప్రైవేటు ఆసుపత్రిలో సైతం కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకొచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు విదేశాల్నించి క్రయోజనిక్ ఆక్సిజన్(Oxygen) తెప్పించామన్నారు. 

కరోనా మహమ్మారి(Corona Pandemic)రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై  దుష్ప్రభావం చూపించినా సంక్షేమ పథకాల్ని మాత్రం ఆపలేదని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమమే ప్రాధాన్యతగా 95 శాతం హామీల్ని పూర్తి చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1 కోటి 80 లక్షలమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..14 లక్షల 54 వేల మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో రోజుకు 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 53.28 లక్షలమందికి వ్యాక్సిన్ తొలిడోసు, 21.64 లక్షలమందికి సెకండ్ డోసు పూర్తయిందని గవర్నర్ స్పష్టం చేశారు. 

మరికాస్సేపట్లో ఏపీ అసెంబ్లీలో తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్(Ap Cabinet) ..రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించింది. 

Also read: AP Cabinet: రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం, మరి కాస్సేపట్లో అసెంబ్లీకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News