Fever Survey: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటింటికీ ఫీవర్ సర్వే తిరిగి ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి ప్రతి ఇంటికీ ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఇండియాలో చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 150కు చేరువలో ఉంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పగడ్బంధీగా చేస్తోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది.
ఇవాళ్టి నుంచి రాష్ట్రమంతా వారానికి ఐదురోజులపాటు ఇంటింటికీ ఫీవర్ సర్వే(Fever Suvey)చేయనుంది. రాష్ట్రంలోని ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జ్వర పరీక్షలు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 33 విడతలుగా ఈ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఎవరికైనా జ్వరంతో పాటు కోవిడ్ లక్షణాలుంటే సంబంధిత ఏఎన్ఎంతో పాటు మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తారు. వెంటనే కోవిడ్ పరీక్షలు చేసి..ఆ పరీక్షల ఆధారంగా హోం ఐసోలేషన్(Home Isolation), చికిత్సకు సంబంధించి సూచనలిస్తారు. ఉచితంగా మందుల కిట్ ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో కావల్సిన సహాయం అందిస్తారు. ఈ సర్వే డేటాను ఆన్‌లైన్ యాప్‌లో నిక్షిప్తం చేయనున్నారు.
ఒమిక్రాన్(Omicron)వెలుగులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విదేశాల్నించి వచ్చేవారి డేటాను పరిశీలించారు. రాష్ట్రానికి రోజుకు 15 వందల నుంచి 2 వేలమంది వరకూ విదేశాల్నించి వస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి 17వ తేదీవరకూ రాష్ట్రానికి 26 వేలమంది విదేశాల్నించి వచ్చారు. వీరందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి..పాజిటివ్‌గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination)ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఫీవర్ సర్వే ద్వారా లక్షణాలున్నవారిని గుర్తించి సరైన చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో నిర్వహించిన ఫీవర్ సర్వే ద్వారా కోవిడ్ మహమ్మారిని నియంత్రణ చేయగలిగింది ప్రభుత్వం.
Also read: AP Corona cases: ఏపీలో భారీగా పెరిగిన కొవిడ్ రికవరీలు- స్థిరంగా కొత్త కేసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook