Covid19 tests: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ పంజా విసురుతున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Pm narendra modi) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల్ని(Covid19 Test)పెంచాలని..పూర్తి స్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆధికారులకు సూచించారు. వైరస్ ప్రబలకుండా నియంత్రణ పద్ధతులపై దృష్టి సారించాలని కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టి..45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వెంటనే వ్యాక్సిన్ అందించాలని ముఖ్యమంత్రి జగన్ (Ap cm ys jagan) ఆదేశించారు.
వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ అవరోధంగా మారిందని..అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో ఉండిపోవడంతో ఇబ్బంది ఏర్పడిందని వైఎస్ జగన్ తెలిపారు. మరోవైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల (Zptc-mptc elections) ప్రక్రియలో మరో ఆరు రోజులే మిగిలుందని..మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగి ఉంటే బాగుండేదని చెప్పారు. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజారోగ్యాన్ని పరిగణలో తీసుకుని ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఓసారి ముగిసిపోతే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయవచ్చని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగియకపోతే కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయడం, పరీక్షలు నిర్వహించడం కష్టమవుతాయన్నారు.
Also read: Amaravati land scam: అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook