Ramatheertham incident: రామతీర్ధం ఘటనపై ప్రభుత్వం సీరియస్..సీఐడీ విచారణకు ఆదేశం

Ramatheertham incident: రామతీర్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా రాముడి విగ్రహాన్ని పునరుద్ధరించాలని సూచించింది.

Last Updated : Jan 4, 2021, 07:48 PM IST
  • రామతీర్ఘం సహా దేవాలయాలపై దాడుల ఘటనలపై ప్రభుత్వం సీరియస్
  • రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశాలు
  • నెలరోజుల్లోగా రామతీర్ధం ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ఆలయం ఆధునీకరణ
Ramatheertham incident: రామతీర్ధం ఘటనపై ప్రభుత్వం సీరియస్..సీఐడీ విచారణకు ఆదేశం

Ramatheertham incident: రామతీర్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా రాముడి విగ్రహాన్ని పునరుద్ధరించాలని సూచించింది.

విజయనగరం ( Vijayanagaram district ) జిల్లాలో జరిగిన రామతీర్ధం ఘటన ( Ramatheertham incident ) రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించాయి. అయితే ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని..సీఐడీ విచారణ ( CID Probe )కు ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికార్లతో సమీక్ష జరిపి పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ చేపట్టిన చర్యలు, భవిష్యత్ లో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దేవాలయాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని అధికారులు సమీక్షలో వివరించారు. చిన్న చిన్న దేవాలయాల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆలయాల్లో సీసీ కెమేరాలు, మెటల్ డోర్ డిటెక్టర్స్ తనిఖీలు, ఎస్పీఎఫ్ సిబ్బందితో బందోబస్తు కొనసాగనుందని అధికారులు తెలిపారు. రామతీర్ధం ( Ramatheertham ) సహా ఇప్పటివరకూ జరిగిన దాడుల వెనుక కుట్రకోణం దాగుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ( Ap minister vellampalli srinivas ) అభిప్రాయపడ్డారు. 

రామతీర్ధం ఆలయాన్ని పూర్తిగా ఆధునీకరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దీని కోసం కొత్త డిజైన్ ఆమోదించామన్నారు. విగ్రహ ప్రతిష్ఠపై ఆగమ పండితులతో మాట్లాడామన్నారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో( Tirupati by elections ) లబ్ది పొందేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

Also read: AP: ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్, మూడోవారంలో వాహనాల కేటాయింపు

Trending News