Journalist House Sites: పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, అర్హతలు, అనర్హతలు, రూల్స్ ఇవే

Journalist House Sites: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జర్నలిస్టులకు శుభవార్త విన్పించింది. గుర్తింపు పొందిన పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కేటాయిపుకు సంబంధించి జీవో విడుదల చేసింది. ఆ జీవో మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 11, 2023, 07:02 AM IST
Journalist House Sites: పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, అర్హతలు, అనర్హతలు, రూల్స్ ఇవే

Journalist House Sites: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోలో ఏయే జర్నలిస్టులు స్థలాలకు అర్హులు, ఎలాంటి షరతులు వర్తిస్తాయనే వివరాలున్నాయి.

ప్రభుత్వం విడుదల చేసిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవో ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి 45 రోజుల్లోగా అప్లికేషన్ల స్వీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో జర్నలిస్టులకు సభ్యులగా అవకాశముంటుంది. ఇక ఇళ్ల స్థలాలు పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, ఇతర నిబంధనలు ఇలా ఉన్నాయి.

కనీసం 5 ఏళ్లు అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఇళ్ల స్థలాలు పొందేందుకు అర్హులౌతారు. 

జర్నలిస్ట్‌కు లేదా అతని జీవిత భాగస్వామికి ఏ ప్రభుత్వ పధకంలోనూ గతంలో ఇంటి స్థలం కేటాయించి ఉంటే ఈ పథకంలో ఇంటి స్థలం పొందేందుకు అనర్హుడు.

జర్నలిస్ట్ లేదా జీవిత భాగస్వామికి పనిచేస్తున్న లేదా నివసించే స్థలంలో ఇంటి స్థలం లేదా ప్లాట్ లేదా ఇళ్లు కలిగి ఉంటే అనర్హులౌతారు.

ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలుు, కార్పొరేషన్‌లలో గుర్తింపు పొందిన ఉద్యోగులకు జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ ప్రకారం ఇంటి స్థలం దక్కదు.

జర్నిస్ట్ పనిచేస్తున్న లేదా నివాస స్థలనంలోనే ఇంటి స్థలనం కేటాయించవచ్చు. పనిచేసే లేదా నివసించే మండలంలో కేటాయింపుకు ప్రాధాన్యత ఉంటుంది. 

ఒక్కొక్క జర్నలిస్టుకు గరిష్టంగా 3 సెంట్ల భూమి కేటాయిస్తారు. ఈ ధరను 60 శాతం ప్రభుత్వం భరిస్తే 40 శాతం జర్నలిస్టు భరించాలి.

కేటాయించిన స్థలంలో లబ్దిదారుడే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. పదేళ్లలో ఇంటి నిర్మాణం చేయకపోతే కేటాయింపు రద్దవుతుంది. 

Also read: TTD Tickets: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News