Yatra 2: యాత్ర 2 సినిమా థియేటర్లు హౌస్‌ఫుల్ చేయాలంటూ ప్రభుత్వ ఆదేశాలు, నిజమెంత

Yatra 2: యాత్ర 2 సినిమా విడుదలైంది. ఏపీలో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లను హౌస్‌ఫుల్ చేయాలని ప్రభుత్వం నేరుగా ఆదేశాలు జారీ చేసింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..సోషల్ మీడియాలో ఇదే జీవో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2024, 03:19 PM IST
Yatra 2: యాత్ర 2 సినిమా థియేటర్లు హౌస్‌ఫుల్ చేయాలంటూ ప్రభుత్వ ఆదేశాలు, నిజమెంత

Yatra 2: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది ఎంతవరకూ వాస్తవం..ప్రభుత్వం అలా ఆదేశాలు జారీ చేయడం సమంజసమేనా ఇప్పుడివే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అసలు ఈ ఆదేశాల్లో నిజానిజాలేంటని జీ న్యూస్ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా 2019లో విడుదలైన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర2 సినిమాను  తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రభుత్వమో ప్రమోట్ చేస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. ధియేటర్లను తొలి రెండ్రోజులు హౌస్‌ఫుల్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు ఓ జీవో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది తప్పకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో ఉన్నాయి. ఇది ఎంతవరకూ నిజమే ఆ జీవోను సునిశితంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. జీవో అడుగున ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరిగా నీలం సహానీ పేరుంది.

ఈ జీవో చూస్తే నిజమే అనుకుంటారంతా. కానీ ఫ్యాక్ట్‌చెక్‌లో ఈ జీవో తప్పని తేలింది. ఈ జీవో అడుగున ఛీఫ్ సెక్రటరీగా నీలం సహానీ పేరుండటంతో ఫేక్ జీవో అని తేలిపోయింది. ఇప్పుడు ఛీఫ్ సెక్రటరీగా ఉన్నది.

Also read: Indian Railway Rules: టికెట్ ఉన్నా సరే రైల్వే టీటీ మిమ్నల్ని రైల్లోంచి దింపేయగలడు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News