Pension Distribution: పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల, పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారంటే

Pension Distribution: జూలై 1 సమీపిస్తోంది కొత్త ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ఎలా చేపడతుందనే ఆసక్తి నెలకొన్న తరుణంలో ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2024, 12:07 PM IST
Pension Distribution: పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల, పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారంటే

Pension Distribution: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పింఛన్ల పంపిణీకు సంబంధించి విధీ విధానాలు నిర్ణయించింది. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల వ్యవస్థతో కాకుండా సచివాలయ సిబ్బందితో చేపట్టనుంది. కొంతమందికి మాత్రం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. 

ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ వ్యవస్థను పక్కన పెట్టవచ్చని తెలుస్తోంది. పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసింది. వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టేవృత్తివారు, ట్రాన్స్‌జెండర్లు, ఏఆర్టీ, డప్పు కళాకారులలకు పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచింది ప్రభుత్వం. ఇక దివ్యాంగులు, కుష్టురోగులకు 3 వేల నుంచి 6 వేలు చేశారు. పూర్తిగా వైకల్యమున్నవారికి 5 వేల నుంచి 15 వేలు, తీవ్ర వ్యాధులు, కిడ్నీ, లివర్, గుండె బైపాస్ , డయాలసిస్ రోగులకు 5 వేల నుంచి 10 వేలు చేశారు.

కొత్త పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నందున జూలై 1న ఒక్కొక్కరు 7 వేల రూపాయలు అందుకుంటారు. ఆ తరువాత ప్రతి నెలా 4 వేల రూపాయలుంటుంది. ఒక్కొక్క సచివాలయం ఉద్యోగి 50 మందికి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కలెక్టర్లు ఇతర అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 

ఇక దివ్యాంగులు, హెచ్ఐవీ బాధితులకు మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతాల్లో పింఛను మొత్తం జమ చేయనున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఉదయం 6 గంటలకు ప్రారంభించి రెండ్రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Also read: Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News