AP IAS Transfers: ఏపీలో అర్ధరాత్రి ఐఏఎస్ బదిలీలు

AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ హఠాత్తుగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2021, 10:19 AM IST
AP IAS Transfers: ఏపీలో అర్ధరాత్రి ఐఏఎస్ బదిలీలు

AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ హఠాత్తుగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో ఒక్కసారిగా ఐఏఎస్ బదిలీలు (IAS Transfers)సంచలనంగా మారాయి. జూలై 23వ తేదీ అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్(Adityanath Das)బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది.కడప, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లా కలెక్టర్లు బదిలీ అయినవారిలో ఉన్నారు. పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్లకు కూడా స్థాన చలనం కలిగింది. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమీషనర్ కోటేశ్వరరావును కర్నూలు జిల్లా(Kurnool District Collector) కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డిని వచ్చారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా కడప కలెక్టర్ చేవూరు హరికిరణ్‌ను నియమించారు.ఆయన స్థానంలో విజయరామరాజుకు కలెక్టర్‌గా ప్రమోషన్ లభించింది. దేవాదాయశాఖ ప్రత్యేక కమీషనర్ పి అర్జునరావును ఏపీ స్టేట్ హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డెరెక్టర్‌గా నియమించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్‌ను దేవాదాయశాఖ కమీషనర్‌గా నియమించారు.తూర్పు గోదావరి(East Godavari District collector) జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిని వైద్య ఆరోగ్య కుటుంబశాఖకు బదిలీ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్‌ను ఆర్ అండ్ ఆర్ కమీషనర్‌గా నియమించారు.కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా నియమించారు. 

Also read; AP Inter Results 2021: ఏపీ ఇంటర్ సెకండీయర్ ఫలితాలు 2021 విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News