AP 10th Class: ఏపీలో చదువుల విప్లవం..10వ తరగతి పరీక్షా విధానంలో మరో కీలక మార్పు..!

AP 10th Class: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా విధానంలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 22, 2022, 06:35 PM IST
  • ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
  • విద్యా విధానంలో సమూల మార్పు
  • ఉత్తర్వులు జారీ
AP 10th Class: ఏపీలో చదువుల విప్లవం..10వ తరగతి పరీక్షా విధానంలో మరో కీలక మార్పు..!

AP 10th Class: ఏపీ పదో తరగతి పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లు ఉండనున్నాయి. ఈవిధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్‌ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండేవి. ఐతే కరోనా కారణంగా పేపర్లను ఏడుకు కుదించారు. 

సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఉండనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్‌ కలిపి ఒకే పేపర్‌లో ఉంటాయి. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కొత్త విధానం తీసుకొచ్చినట్లు విద్యా శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏడాది పొడువునా వివిధ రకాలు పరీక్షలు జరుగుతుంటాయని..అలాంటప్పుడు 11 పేపర్లు అవసరం లేదని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.

ఈమేరకు గతంలో ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 82ను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్సీలో పరీక్షలు ఉండనున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈఏడాది 10వ తరగతి ఫలితాలు అందర్నీ షాక్‌కు గురి చేశాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు. తెలుగు, సోషల్‌ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు పాస్‌ కాలేకపోయారు.

దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో అందర్నీ పాస్‌ చేసింది. ఇదే చివరి అవకాశమని..ఇకపై ఇలాంటి నిర్ణయాలు ఉండబోవని స్పష్టం చేసింది. ఇందులోభాగంగానే ఏపీ పదో తరగతి పరీక్ష విధానంలో సమూల మార్పులను తీసుకొచ్చారు. ఇప్పటికే బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. త్వరలో అన్ని తరగతుల్లో డిజిటల్ చదువులు ఉండనున్నాయి. 

Also read:Pawan Kalyan: పరిశ్రమలు పెట్టాలంటే కప్పం కట్టాలా..వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్‌ ధ్వజం..!

Also read:Kishan Reddy: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అందుకేనా..కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News