/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

ఏపీ ప్రభుత్వం ( Ap Government ) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్ర పోలీస్ శాఖ ( Ap Police ) లో త్వరలో భారీగా పోలీసు నియామకాల్ని చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( Police Commemoration Day ) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) పాల్గొన్నారు. కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ సమయంలో పోలీసులు అందించిన సేవలు అమూల్యమైనవని వైఎస్ జగన్ కొనియాడారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ( Disha Police Stations ) ఏర్పాటు చేశామని వైఎస్ జగన్ తెలిపారు. నేరం చేసింది ఎవరైనా సరే..చట్టం ముందు నిలబడాల్సిందేనన్నారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించవద్దని కోరారు. 

పోలీసులకు వీక్ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ( Ap Home minister Sucharitha ) స్పష్టం చేశారు. పోలీసుల అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. పోలీసు శాఖలో మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజల రక్షణ కోసం  వీరమరణం పొందిన పోలీసులు అందరికీ ఆదర్శమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Ap DGP Gautam sawang ) చెప్పారు. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీ పోలీసులకు 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని డీజీపీ వివరించారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా  ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. పోలీసు శాఖలో 6 వేల 5 వందల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ భర్తీ ప్రక్రియ కూడా  నాలుగు దశల్లో చేపడతామన్నారు. పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎం చెప్పారు. జనవరి నెలలో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పధకాల్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి  వర్తించేలా చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలతో పాటు ఇతర స్కీముల్ని కూడా అమలు చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మరో పథకాన్ని కూడా ప్రారంభించింది. రేషన్ కార్డు ఉండి... కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు వైఎస్సార్‌ భీమా పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో కోటి 41 లక్షల కుటుంబాలకు ఈ పధకం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఓ వైపు పోలీసు సంస్మరణ దినోత్సవంలో పోలీసు ఉద్యోగాల ప్రకటన, మరోవైపు వైఎస్సార్ భీమా పథకం ( Ysr Bheema scheme ) రెండూ ఇవాళే చోటుచేసుకున్నాయి. Also read: AP: మరో కీలక పథకం, వైఎస్సార్ భీమా ప్రారంభించిన వైఎస్ జగన్

 

Section: 
English Title: 
Ap Government going to recruit jobs in police department
News Source: 
Home Title: 

AP: రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాల నియామకం

AP: రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాల నియామకం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP: రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాల నియామకం
Publish Later: 
No
Publish At: 
Wednesday, October 21, 2020 - 16:28
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman