AP: రాష్ట్రంలో మత సామరస్య కమిటీల ఏర్పాటు, జీవో నెంబర్ 6 విడుదల

ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్య కమిటీల్ని ఏర్పాటు చేసింది.

Last Updated : Jan 7, 2021, 09:44 PM IST
AP: రాష్ట్రంలో మత సామరస్య కమిటీల ఏర్పాటు, జీవో నెంబర్ 6 విడుదల

ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్య కమిటీల్ని ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ‌లో గత కొద్దికాలంగా హిందూ ఆలయాలపై దాడులు ( Attacks on Hindu temples ) , విగ్రహాల్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు కలకలం కల్గిస్తున్నాయి. తాజాగా రామతీర్ధం ఘటన ( Ramtheertham incident ) ఆందోళనకు దారి తీసింది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) రాష్ట్రవ్యాప్తంగా ప్రార్ధనా స్థలాల్లో 20 వేల సీసీ కెమేరాలు ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు మత సామరస్య కమిటీల్ని( Religious harmony committees ) ఏర్పాటు చేసింది. ఏపీ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది.

20 మంది సభ్యులతో ఉండే ఈ కమిటీలో హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులుంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. రాష్ట్ర కమిటీలో అన్ని మతాలకు చెందినవారు ఒక్కొక్కరు ప్రతినిధిగా ఉంటారు. వీటికి అనుబంధంగా జిల్లా కమిటీలు కలెక్టర్ల నేతృత్వంలో ఉంటాయి.

వరుస ఘటనల ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారుతోందని..మత సామరస్యం ( Religious Harmony ) దెబ్బతినే పరిస్థితులు ఇబ్బంది కల్గిస్తున్నాయని ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ ( Ap Chief secretary Adityanath das ) తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 6 విడుదల చేసింది ప్రభుత్వం. అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆదిత్యనాధ్ దాస్ చెప్పారు. ఈ కమిటీలకు కాల పరిమితి ఉండదని..మత సామరస్యాన్ని కాపాడేందుకు కృష్టి చేస్తాయని తెలిపారు. దాడుల వెనుక లోతైన కుట్ర మాత్రం ఉందని..దాన్ని ఛేదించాలంటే పోలీసులు, మతపెద్దలు అందరికీ బాధ్యత ఉండాలన్నారు. 

Also read: AP: టీడీపీ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణం రేపు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News