AP Govt On DA: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల(Government employees)కు ఏపీ సర్కారు(AP government) శుభవార్త చెప్పింది. కొత్త డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని(Dearness Allowance) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన షెడ్యుల్‌కు అనుగుణంగా 2022 జనవరి నుంచి పెంచిన డీఏ(DA)ని జీతానికి జమ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ కే.వెంకటరామిరెడ్డి తెలిపారు.
జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా డీఏను చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు, మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నట్లు ఉత్వర్వుల్లో వెల్లడించింది. జడ్పీ, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, అన్ని ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: Ys Jagan Birthday: సముద్రగర్భం నుంచి విషెస్, జగన్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook