AP: చంద్రబాబు అందుకు అర్హుడు కాదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అధికార పక్ష నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి శనిలా దాపురించారని..సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తి కాదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల విరుచుకుపడ్డారు.

Last Updated : Sep 14, 2020, 08:58 AM IST
AP: చంద్రబాబు అందుకు అర్హుడు కాదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ( Opposition leader chandra babu naidu ) పై అధికార పక్ష నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి శనిలా దాపురించారని..సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తి కాదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల విరుచుకుపడ్డారు.

అంతర్వేది ( Antarvedi ) రధం దగ్దమైన ఘటనపై రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి  ( Sajjala ramakrishna reddy ) తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి శనిలా దాపురించారని విమర్శించారు. అసలు సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తి కాదని దుయ్యబట్టారు. బాబు హయాంలో రథం తగలబడినప్పుడు బీజేపీ, పవన్‌ లు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వైఎస్ కుటుంబం ( ys family ) ఎప్పుడూ మతాలకు అతీతంగా ప్రజలను ప్రేమిస్తుందని, హిందువుల మనోభావాలను గౌరవిస్తుందని చెప్పారు. చెప్పులు వేసుకుని శంకుస్థాపనలు, పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్న చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఎర్రచందనం ఎన్‌కౌంటర్‌లో కూలీలను చంపినప్పుడు..పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు జాతీయ మీడియా ఎందుకు ఇంతగా  ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు

కోవిడ్ కష్టకాలంలో ( covid pandemic time ) కూడా 11 వేల కోట్లను ప్రజలకు అందిస్తోందంటే.. ఎవరికి కడుపు మండిందో వారే రథాలకు కూడా మంట అంటిస్తారన్నది కామన్‌ సెన్స్‌ పాయింట్‌ అని చెప్పారు. సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు పంపుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుంద్నారు. Also read: AP Police: ప్రార్ధనాలయాల పరిరక్షణకు కీలక నిర్ణయాలు

Trending News