Covid Vaccination: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక నుంచి 18 ఏళ్లు దాటినవారికి సైతం వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination)లో భాగంగా మరో ముందడుగు పడింది. నిన్నటి వరకూ కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ రాష్ట్రంలో ప్రారంభం కాలేదు. ఇక వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో ఇవాళ్టి నుంచి 18-44 ఏళ్ల వయస్సువారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన సచివాలయాల ద్వారా 18-44 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఐదు సెంటర్లను దీనికోసం ఎంపిక చేశారు.
ఇప్పటి వరకూ ఏపీలో హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఐదేళ్లు లోపు చిన్నారుల తల్లులు, గర్భిణీ స్త్రీలు, టీచర్లు, 44 ఏళ్లు దాటినవారికి మొదటి డోసు వ్యాక్సిన్ 96 శాతం పూర్తయింది. ప్రస్తుతం రెండవ డోసు కొనసాగుతోంది. కరోనా థర్డ్‌వేవ్‌ను(Corona Third Wave)సమర్ధవంతంగా ఎదుర్కొనే క్రమంలో ఇక నుంచి 18 ఏళ్లు దాటినవారికి కూడా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ సెంటర్లలో రద్దీని తగ్గించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వ్యాక్సిన్ అందిస్తారు. రాష్ట్రంలో 18-44 ఏళ్ల వయస్సువారు దాదాపు 1.9 కోట్లున్నారని అంచనా. వీరందరికీ వ్యాక్సిన్ ఇస్తూనే..రెండవ డోసు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో దాదాపు 2.64 కోట్లమందికి వ్యాక్సిన్ అందింది.
Also read: Income Tax Department: ఈ ఫైలింగ్ సమస్యలపై ఇన్ఫోసిస్‌పై కేంద్ర ఆర్ధికశాఖ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook