Ap Fibernet Scam: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ వాయిదా

Ap Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కేసు వాయిదా పడింది. ఏపీ స్కిల్ స్కాంలో క్వాష్ పిటీషన్ విచారించిన ధర్మాసనమే ఫైబర్ నెట్ కేసు విచారిస్తుండటం గమనార్హం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2024, 07:47 PM IST
Ap Fibernet Scam: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ వాయిదా

Ap Fibernet Scam: ఏపీ స్కిల్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైన మరుసటి రోజే ఫైబర్ నెట్ కేసులో మరో పరిణామం జరిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. అసలేం జరిగిందంటే..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో దాఖలు చేసుకున్న క్వా,ష్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు సీజేఐకు రిఫర్ చేయడంతో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఈ కేసును విచారించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఎం బేలా త్రివేది ధర్మాసనమే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారించింది. ఈ కేసు విచారణ ఇవాళ జరగాల్సి ఉండింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తుగా బెయిల్ వస్తుందని ఆశించిన చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. అయితే ద్విసభ్య ధర్మాసనంలో ఓ న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది కోర్టులో బిజీగా ఉండటంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా పడింది. తిరిగి విచారణ ఎప్పుడనేది మరోసారి ప్రకటిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం తరువాత ఏపీ ఫైబర్ నెట్ స్కాం అత్యంత కీలకమైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇవాళ ఆయనకు ముందస్తు బెయిల్ లభిస్తుందని ఆశించినా ప్రయోజనం దక్కలేదు. ఇవాళ ఆ కేసు కాస్తా వాయిదా పడింది. 

Also read: YCP 4th List: వైసీపీ నాలుగో జాబితా, రాజమండ్రి నుంచి వివి వినాయక్, గుంటూరు లేదా నంద్యాల నుంచి అలీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News