AP EAMCET 2020: ఏపీ ఎంసెట్‌ దరఖాస్తుకు మరో ఛాన్స్

ఏపీ ఎంసెట్‌కు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుంటుండగా దరఖాస్తులకు (AP EAMCET Application 2020) మరో అవకాశం ఇచ్చారు. ఏదైనా కారణంతో ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోనివారు .. ఎంసెట్ రాయాలనుకుంటే వారికి ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది.

Last Updated : Sep 14, 2020, 04:41 PM IST
  • ఏపీ ఎంసెట్‌ దరఖాస్తులకు మరో అవకాశం
  • రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు
  • లాసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లకు సైతం అవకాశం
AP EAMCET 2020: ఏపీ ఎంసెట్‌ దరఖాస్తుకు మరో ఛాన్స్

ఓవైపు విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుంటుండగా దరఖాస్తులకు మరో అవకాశం (AP EAMCET Application 2020) ఇచ్చారు. ఏదైనా కారణంతో ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోనివారు .. ఎంసెట్ రాయాలనుకుంటే వారికి ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది. రూ.10 వేల ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. IPL 2020: జట్టుతో చేరిన అరుదైన క్రికెటర్

ఎంసెట్‌ సహా లాసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లకు సైతం దరఖాస్తులకు అవకాశం కల్పించింది ఏపీ ఉన్నత విద్యా మండలి. అయితే లాసెట్ అభ్యర్థులు రూ.2,000 ఆలస్య రుసుము (Late Fee) చెల్లించి సెప్టెంబర్ 25 వరకు, పీజీఈసెట్ అభ్యర్థులు రూ.2000 చెల్లించి సెప్టెంబర్ 23 వరకు, ఎడ్‌సెట్ అభ్యర్థులు రూ.500 చెల్లించి సెప్టెంబర్ 25 వరకు, పీఈసెట్ అభ్యర్థులు రూ.200 లేట్ ఫీజు చెల్లించినట్లయితే సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. Goddeti Madhavi: మరో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీలకు కరోనా పాజిటివ్

పరీక్షల తేదీలివే.. (AP EAMCET Schedule 2020)
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను సెప్టెంబర్ 17, 18, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు.

Trending News