చంద్రబాబుతో చర్చించాకే డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటాం: గంటా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డీఎస్సీ) పై విద్యాశాఖ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకి తెలిపారు.

Last Updated : Sep 28, 2018, 12:16 PM IST
చంద్రబాబుతో చర్చించాకే డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటాం: గంటా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డీఎస్సీ) పై విద్యాశాఖ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకి తెలిపారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి గంటా విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యయ అర్హత పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎపిపిఎస్‌సి వారికి అందజేయాలా వద్దా.. అనే విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తమ ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గంటా తెలిపారు. అరకులో జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని కూడా ఆయన అన్నారు.

కాగా.. వారం రోజుల క్రితమే గంటా మాట్లాడుతూ.. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ మరో వారంలోగా విడుదల చేయనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలు ఉండవని, పూర్తిగా ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని కూడా మంత్రి అప్పుడు తెలిపారు.  డీఎస్సీ-2014 ద్వారా 9 వేల పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, ఇప్పుడు డీఎస్సీ-2018 ద్వారా మరో తొమ్మిది వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

కాగా.. రాష్ట్రంలో 2013లో ప్రారంభించిన మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని పలు టీచర్ల సంఘాలు ఈ రోజు ఆందోళనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్‌ సందర్భంగా మాట్లాడుతూ మోడల్‌ స్కూళ్లను డీ లింక్‌ చేసినా.. చంద్రబాబు ప్రభుత్వం విలీనం చేయకపోవడానికి కారణం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నించాయి. 163 మోడల్‌ పాఠశాలల్లో ఇంకా 929 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని.. ఈ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయకుండా.. 70 శాతం పదోన్నతుల ద్వారా... 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.

Trending News