COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 23,160 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3528, చిత్తూరు జిల్లాలో 2670, అనంతపురం జిల్లాలో 2334, విశాఖపట్నం జిల్లాలో 2007, పశ్చిమ గోదావరి జిల్లాలో 1879 కేసులు వెలుగు చూశాయి. అలాగే ప్రకాశం జిల్లాలో 1590, గుంటూరు జిల్లాలో 1501, కృష్ణా జిల్లాలో 1496, శ్రీకాకుళం జిల్లాలో 1440, కర్నూలు జిల్లాలో 1310, నెల్లూరు జిల్లాలో 1239 మంది, కడప జిల్లాలో 1221, విజయనగరం జిల్లాలో 945 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
గత 24 గంటల్లో 24,819 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా అదే సమయంలో మరో 106 మంది కరోనాతో మరణించారు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లాలోనే 17 మంది చనిపోగా.. నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 11 మంది చొప్పున, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో 8 మంది చొప్పున కరోనాతో కన్నుమూశారు.
Also read : Ys Jagan: ప్రభుత్వాసుపత్రుల్లో సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ మెషీన్లను ప్రారంభించిన వైఎస్ జగన్
అదే విధంగా గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు చొప్పున కరోనాతో చనిపోయారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఏపీలో ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునివ్వగా మిగతా సమయాల్లో లాక్‌డౌన్ అమలులో (Lockdown timings in AP) ఉంటోంది. రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నందున లాక్‌డౌన్‌ని కూడా అంతే కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు తమ వంతు కృషి చేస్తోంది.
Also read : Ap Covid19 Update: ఏపీలో భారీగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook