Vamsadhara Tribunal: వంశధార నది జలాలపై ట్రిబ్యునల్ తీర్పును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతించారు. ట్రిబ్యునల్ తీర్పు రావడంతో ఇక నేరడి ప్రాంతంలో త్వరలోనే బ్యారేజ్ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు వైఎస్ జగన్.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీ జలాల వినియోగంపై ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొంది. ఈ వివాదానికి ముగింపు పలుకుతూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (Vamsadhara Tribunal)2017 సెప్టెంబర్ 13న తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై అంతర్రాష్ట జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 5 (3) కింద ఒడిశా ప్రభుత్వం (Odisha government)అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై విచారించిన ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందం శర్మ ఒడిశా అభ్యంతరాల్ని తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసి కేంద్రానికి పంపించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆ తరువాత తీర్పు అమల్లో వస్తుంది. తుది తీర్పును సవాలు చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది.
వంశధార ట్రిబ్యునల్ తీర్పు వెలువడటంతో ఇక నేరడి ప్రాంతంలో త్వరలో బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన పనుల్ని ప్రారంభించాలని అధికారులను వైఎస్ జగన్ (Ap cm jagan) ఆదేశించారు. నేరడి బ్యారేజ్(Neradi Barrage) నిర్మాణ శంకుస్థాపనకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానించనున్నట్టు జగన్ తెలిపారు.
Also read: Chiranjeevi: వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్ చిరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook