Ys Jagan to Vizag: విశాఖ నుంచే పరిపాలన, అంతా సిద్ధం, ఎప్పట్నించంటే..?

Ys Jagan to Vizag: ఆంధ్రప్రదేశ్ నూతన పరిపాలన రాజధానిగా విశాఖపట్నం సిద్ధమౌతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు షిఫ్ట్ ఎప్పుడయ్యేది ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయింది. ఆ వివరాలు మీకోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2023, 03:03 PM IST
Ys Jagan to Vizag: విశాఖ నుంచే పరిపాలన, అంతా సిద్ధం, ఎప్పట్నించంటే..?

Ys Jagan to Vizag: ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం మారనుంది. కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండా విశాఖ నుంచి వైఎస్ జగన్ పరిపాలన ప్రారంభించవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా నిర్ణయమైపోయింది.

ఏపీ మూడు రాజధానుల అంశం ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది. ఈ నెల 28వ తేదీన విచారణ ఉంది. తీర్పు ఎలా ఉన్నా..అనుకూలమైనా లేదా ప్రతికూలమైనా విశాఖపట్నం మాత్రం పరిపాలనకు సిద్ధమౌతోంది. ముఖ్యమంత్రిగా ఎక్కడి నుంచైనా పాలించే హక్కున్నందున ఆ ప్రాధాన్యత ప్రకారం విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమౌతున్నారు.

ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులోనూ, విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులోనూ త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కానుందని, త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతానని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఇక అప్పట్నించి విశాఖ పరిపాలనా రాజధాని ప్రచారం ముమ్మరమైంది. మరి ఎప్పటి నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభం కానుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించకపోయినా..ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. 

అసెంబ్లీ సమావేశాలు ముగియగానే విశాఖకు ముఖ్యమంత్రి జగన్ మకాం మార్చవచ్చు. వారానికి ఐదు రోజులు విశాఖలో, శని, ఆదివారాలు అమరావతిలో ఉండనున్నారు. విశాఖలో జరగనున్న జీ20 సదస్సు అనంతరం బదిలీ అయ్యే పరిస్థితులున్నాయి. వాస్తవానికి ఉగాదికి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలనున్నా కొన్ని కారణాలతో వాయిదా పడింది. మరోవైపు ఈ నెల 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

సీఎం కార్యాలయంగా విశాఖలోని పోర్ట్ గెస్ట్‌హౌస్ సిద్ధమౌతోంది. మరోవైపు వారానికి రెండ్రోజులు పల్లె నిద్ర కార్యక్రమం కూడా ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు జీఏడీ కూడా విశాఖకు తరలివెళ్లనుంది. అంటే ముఖ్యమంత్రిగా ఎక్కడి నుంచైనా పరిపాలన చేసుకునే వెసులుబాటు, హక్కున్నందున కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండా విశాఖ నుంచి పరిపాలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. 

Also read: Pawan Kalyan: అదే జరిగిఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు.. సగానికిపై వాళ్ల ఓట్లే వచ్చాయి: పవన్ కళ్యాణ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News