YS Jagan: విజయదశమికి జగన్ ఛలో విశాఖ, 23న కొత్త ఇంటి గృహ ప్రవేశం

YS Jagan: ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం నుంచి పాలన మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మకాం మారేందుకు అంతా సిద్ధమౌతోంది. ముహూర్తం ఫిక్స్ అవడంతో ఇక పనులు చకచకా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 1, 2023, 09:00 AM IST
YS Jagan: విజయదశమికి జగన్ ఛలో విశాఖ, 23న కొత్త ఇంటి గృహ ప్రవేశం

YS Jagan: విజయదశమికి విశాఖపట్నం ముస్తాబవుతోంది. దసరా ఉత్సవాలకు కాదు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను స్వాగతించేందుకు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలించేందుకు మకాం మార్చనున్నారు. ఈ నెల 23న విశాఖ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. 

ఈసారి విజయదశమికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛలో విశాఖ అంటున్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సాక్షిగా త్వరలో విశాఖకు మకాం మారుస్తానని, ఇక్కడ్నించి పరిపాలన సాగిస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారు. విశాఖ రుషికొండపై జరుగుతున్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కార్యాలయం పనులు వేగవంతమయ్యాయి. విజయదశమికి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 23న విశాఖ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 

కేవలం మూడు వారాల సమయమే మిగిలుండటంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాడేపల్లి నుంచి సీఎం క్యాంప్ ఆఫీసు విశాఖకు మారనుంది. అటు అధికార యంత్రాంగం కూడా ఇందుకు అనుగుణంగా మారేందుకు సిద్ధమౌతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు అనుబంధ శాఖాధికారులు కూడా విశాఖ నుంచే పరిపాలన సాగించనున్నారు. ప్రముఖ నిర్మాణ కంపెనీ డీఈసీ ఆధ్వర్యంలో అత్యంత వేగంగా, నాణ్యతతో పనులు జరుగుతున్నాయంటున్నారు అధికారులు. అక్టోబర్ 15 నాటికి ముఖ్యమంత్రి ఇంటి పనులు పూర్తి చేసి సెక్యూరిటీ విభాగానికి అప్పగించాల్సి ఉంది. అయితే 20 నాటికి అప్పగిస్తామంటోంది డీఈసీ. 

ప్రస్తుతానికి ఇంటీరియర్ పనులు, డోర్స్, ఫినిషింగ్ టచ్ పనులు కొనసాగుతున్నాయి. ల్యాండ్ స్కేపింగ్ పనులు మరో రెండ్రోజుల్లో ప్రారంభం కావచ్చు. ఇప్పటికే 8 కోట్ల ఖర్చుతో కాంపౌండ్ వాల్ , 4 కోట్లతో బ్యూటిఫికేషన్ పనుల టెండర్లు పూర్తయ్యాయి. మరోవైపు ఇతర కార్యాలయాల నిర్వహణకు విశాఖ బీచ్ రోడ్డులో 50 ఇళ్లను అద్దెకు తీసుకుని ఆధునీకరిస్తున్నారు. 

Also read: Supreme Court: చంద్రబాబు క్వాష్‌పై మంగళవారం ఉత్కంఠ, ఏం జరగనుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News