YS Jagan Holi Wishes: హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్

YS Jagan Holi Wishes | నేడు దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. గతానికి భిన్నంగా కాస్త భయం భయంగా రంగుల పండుగలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 29, 2021, 11:58 AM IST
YS Jagan Holi Wishes: హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్

తెలుగు రాష్ట్రాల ప్రజలు నేడు రంగుల పండుగ జరుపుకుంటున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో హోలీ వేడుకను పలు జాగ్రత్తల నడుమ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

‘ఆప్యాయ‌త‌, ప్రేమ‌, సంతోషాల హ‌రివిల్లు హోలీ! ప్రతి ఒక్కరి జీవితం ఆనందాల‌తో నిండాల‌న్న ఆకాంక్ష హోలీ! ఈ హోలీ పండుగ వేళ రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాల స‌ప్త వ‌ర్ణాలు వెల్లివిరియాల‌ని నిండు మ‌న‌సుతో కోరుకుంటున్నాను!’ Happy Holi 2021 అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Also Read: Holi 2021 Celebration Ban: హోలీ వేడుకలు నిషేధించిన, ఆంక్షలు విధించిన రాష్ట్రాలు ఇవే

తెలుగు వారికి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు. ఈ రంగుల పండుగ మీ ఇంట శుభాలను కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను. కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వేళ ఇంటిల్లిపాది జాగ్రత్తగా ఉండాలని ఆకాంక్షిస్తూ’ ట్వీట్ ద్వారా హోలీ విషెస్ చెప్పారు.

Also Read: Holi 2021 Skin Care: హోలీ పండుగతో జర జాగ్రత్త, ఏమేం పాటిస్తూ హోలీ జరుపుకోవాలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News