Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. పోక్సో స్టీల్‌ను విశాఖకు కాకుండా కడపకు తరలిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్( Andhra pradesh )లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ( Visakha steel plant privatisation )కు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఇప్పటికే స్పష్టం చేసిన అధికారపార్టీ..అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. విశాఖపట్నం శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm Ys jagan )..ఉద్యోగ సంఘాలు, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర సేపు ఉద్యోగ సంఘాలతో జరిపిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ప్రధానికి తాను రాసిన లేఖతో పాటు విశాఖ ఉక్కుకు కావల్సిన గనులపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఓఎన్ఎండీసీతో జరిగిన ఒప్పందాన్ని మరోసారి సమీక్షిస్తామన్నారు. పోస్కో స్టీల్‌ప్లాంట్ ( Posko steel plant )విశాఖకు వచ్చే అవకాశాలుండవని తేల్చి చెప్పారు. పోస్కో ప్రతినిధులు గతంలో కలిసినప్పుడే కడపలో ఏర్పాటు చేయమని సూచించినట్టు తెలిపారు. కడపలో కుదరని పక్షంలో శ్రీకాకుళం జిల్లా భావనపాడు కృష్ణపట్నం పోర్టుల వద్ద ఏర్పాటు చేసినా సహకరిస్తామని కార్మిక సంఘాలకు తెలిపారు.
ఒకవేళ కేంద్ర నిర్ణయంలో మార్పు లేకపోతే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ( Visakha steel plant privatisation )కు వ్యతిరేకంగా బడ్జెట్ సమావేశాల్లో( Assembly Budget Sessions) తీర్మానం చేస్తామన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కార్మిక సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మాటలతో తమకు భరోసా వచ్చిందన్నారు. జగన్ స్పందించిన తీరు తమ ఉద్యమానికి ఊపిరి పోసిందని తెలిపారు. తమ సమస్యల్ని ముఖ్యమంత్రి సానుకూలంగా విన్నారని కార్మిక నేతలు చెప్పారు. స్టీల్ ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఉద్యమం చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్( Ys jagan )సూచించారని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామనడం శుభపరిణామమన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైనవారిలో 14 మంది కార్మిక సంఘ నేతలున్నారు.
Also read: Ys Sharmila new party: వైఎస్ షర్మిల కొత్త పార్టీకు సలహాదారుల నియామకం, ఎవరో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook