ప్రతిష్టాత్మక వైఎస్సార్ ఆసరా పథకం ( Ysr Aasara scheme ) ఏపీ ( AP ) లో రేపు ( సెప్టెంబర్ 11 న ) ప్రారంభం కానుంది. 90 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) నెరవేరుస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) తెలిపారు. ఇందులో భాగంగా రేపు ( సెప్టెంబర్ 11న ) మరో ప్రతిష్టాత్మక పథకమైన వైఎస్సార్ ఆసరా ప్రారంభం కానుందని చెప్పారు. రాష్ట్రంలోని 90 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. మహిళలకు మొదటి విడత నగదును వారి వారి ఖాతాల్లో వేయనున్నారు. పొదుపు సంఘాల మహిళలకు నాలుగేళ్లలో 27 వేల 128 కోట్లు అందించనున్నారు. తొలి విడతలో భాగంగా సెప్టెంబర్ 11న 6 వేల 792 కోట్లు విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఒక్క బటన్ నొక్కడం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరనుంది. Also read: Andhra Pradesh: ప్లాస్మా దానం చేసిన డిప్యూటీ సీఎం బాషా