పోలవరంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించారు. పనుల తీరు గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కాఫర్ డ్యామ్ నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. ప్రతిపక్షం అపోహలు సృష్టించి పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తోందని .. ఇలాంటి అపోహలు నమ్మవద్దన్నారు. ఒక వేళ పోలవరం ఆగిపోయే పరిస్థితులు వస్తే ఎంతవరకైనా వెళ్తానని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరంపై కేంద్రంతో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
శ్వేతపత్రం అవరసమేముంది ?
ఏపీ సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ‘పోలవరం’పై శ్వేతపత్రం గురించి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని.. రోజువారీ లెక్కలు చెబుతుంటే ఇంకా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు.
పోలవరంపై బాబు సంచలన వ్యాఖ్యలు