Kuppam 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 9 నెలల సమయముంది. ఓ వైపు లోకేష్ పాదయాత్ర, మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో రాజకీయాల వేడెక్కాయి. పొత్తులపై సమీకరణాలు స్పష్టం కాకపోయినా అధికార పార్టీ మాత్రం వైనాట్ 175 నుంచి వెనక్కి తగ్గడం లేదు.
2024 అసెంబ్లీ ఎన్నికలు ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ వైనాట్ 175. అంటే 175కు 175 నియోజకవర్గాలు గెలిచి తీరాలి. అంటే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఓటమి పాలవ్వాలి. అందుకే వైనాట్ కుప్పం అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 35 ఏళ్లు కుప్పం నుంచే గెలిచిన చంద్రబాబును అక్కడి నుంచి ఓడించడం అంత సులభం కాదనే సంగతి అధికార పార్టీకు తెలుసు. అందుకే వ్యూహం ప్రకారం పావులు కదుపుతోంది. కుప్పంలో చంద్రబాబు 1989 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అంటే ఏడుసార్లు కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు.
2019 ఎన్నికల్లో తొలిసారి చంద్రబాబు నాయుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చంద్రమౌళి గట్టిపోటీ ఇచ్చారు. వాస్తవానికి మొదటి రెండు రౌండ్లు వైసీపీనే ఆధిక్యంలో ఉంది. కానీ తరువాత క్రమంగా మెజార్టీ పెంచుకున్న చంద్రబాబు కుప్పం నుంచి విజయం సాధించారు. అయితే అనంతరం పంచాయితీ, మున్పిపల్ ఎన్నికల్లో కుప్పంలో అధికార పార్టీ జెండా ఎగురవేసింది. టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఇక అప్పట్నించి వైసీపీలో ఆత్మ విశ్వాసం పెరిగింది. వైనాట్ కుప్పం అంటోంది.
కుప్పం నియోజకవర్గ బాధ్యతను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇప్పటికే పెద్దిరెడ్డి కుప్పంలో పల్లెబాట ప్రారంభించి..నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కుప్పంలో పార్టీ ప్రతిష్ఠ కాపాడేందుకు చంద్రబాబు తరచూ పర్యటనలు చేస్తున్నారు. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా స్థానిక నేతలకు టార్గెట్ విధించారు.
Also read: Nellore Urban MLA Anil Kumar Yadav: తనని కోస్తే.. తన రక్తంలోనూ జగన్ ఉంటాడు.. అనిల్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ అప్రమత్తమైంది. నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లేందుకు వీలుగా పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని పెంచుతోంది. ఓట్ల లెక్కలతో సమీకరణాలు వేసుకుంటూ అందుకు అనుగుణంగా పనిచేస్తోంది. లెక్కలు సరిగ్గా వేసి కొడితే కుప్పం పెద్ద కష్టమేం కాదంటోంది వైసీపీ.
Also read: Minister Roja: హాయ్ ఏపీ.. బైబై బీపీ.. పవన్ కళ్యాణ్‌కు మంత్రి రోజా కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook