Andhrapradesh: కరోనా వైరస్ కంటే ఆయనే ప్రమాదకరం: నారా లోకేష్

కరోనా కంటే ప్రమాదకరమైనది జగరోనా వైరస్ అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నిస్తోందని, దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 

Last Updated : Mar 16, 2020, 08:40 AM IST
Andhrapradesh: కరోనా వైరస్ కంటే ఆయనే ప్రమాదకరం: నారా లోకేష్

అమరావతి: కరోనా కంటే ప్రమాదకరమైనది జగరోనా వైరస్ అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నిస్తోందని, దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 

Also Read: మైనర్‌పై పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక

గతంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను కోర్టు ముందు నిలబెట్టడం, బదిలీలకు కారణమయ్యారని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలను కొసాగించినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని  నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర యువతకి పరిశ్రమల శాఖ ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకుందని ఆయన  అన్నారు. 

Read Also: రిసార్ట్ నుంచి సొంతగూటికి ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో జోష్

అయితే మరోవైపు రాష్ట్రంలో  (AP Local Bodies Elections) స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, గన్నవరం  తెలుగుదేశంపార్టీ నాయకులు జాస్తి.వెంకటేశ్వరరావు గారి కారు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ నాయకులపై దాడి చేస్తున్నారని తద్వారా తెలుగుదేశం శ్రేణులను భయాందోళనలు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని అధికారపార్టీకి చెందిన కొందరు ఈరకమైన కుట్రకి పాల్పడినట్లు తెలుస్తుందని ఆయన అన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News