Andhrapradesh: ఎన్నికల కమిషన్ పై వైఎస్ జగన్ ఫైర్

తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని, చంద్రబాబు 

Last Updated : Mar 16, 2020, 09:07 AM IST
 Andhrapradesh: ఎన్నికల కమిషన్ పై వైఎస్ జగన్ ఫైర్

అమరావతి: తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని, చంద్రబాబు వ్యవస్థలను నీరుగారుస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ పై ప్రజలు ఆందోళన చెందవల్సిన అవసరంలేదని అన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందని, విశాఖపట్నంలో 200, విజయవాడలో 50 పడకల ఇసోలేషన్ వార్డులు ముందస్తు చర్యల్లో భాగంగా సిద్ధం చేశామన్నారు.

Read Also:  గుజరాత్‌లో పొలిటికల్ డ్రామా..!!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, కులాలు మతాలకు అతీతంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలని, కరోనా వైరస్ సాకుతో ఎన్నికలు వాయిదా వేయడం, అధికారులను, కలెక్టర్లను బదిలీ చేయటంపై మండిపడ్డారు. 

Also Read: మైనర్‌పై పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక

ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల కమిషనర్ కనీస సమాచారం అందించకపోవడం శోచనీయమన్నారు. చివరకు పేదలకు ఇళ్ల పట్టాల ప్రక్రియను కూడా ఆపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని, ప్రజలు ఓట్లు వేసి 151 స్థానాలు ఇస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని తమ ప్రభుత్వంపై వివక్ష చూపడం సరికాదని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News