CM JAGAN@3: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తైంది. 2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటోంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది వైసీపీ. టీడీపీ కేవలం 23 సీట్లపై పరిమితం కాగా.. జనసేన ఒక్క చోట మాత్రమే గెలిచింది. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. మూడేళ్ల పాలనలో సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు జగన్. ఎన్నికలు ఇచ్చిన హామీలకు దాదాపుగా 95 శాతం అమలు చేశారు. అయితే ఏపీకి గతంతో పోలిస్తే అప్పులు పెరిగిపోయాయి. దీంతో ఏపీని జగన్ దివాళా తీయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తన పాలనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది.. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం.. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టామని ట్వీట్ లో తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.
మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022
మరోవైపు వైసీపీ మూడేళ్ల పాలన, సీఎం జగన్ తీరుపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. జగన్ మూడేళ్ల పరిపాలనను మూడు మాటల్లో తేల్చేస్తూ ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడేళ్ల పాలనలో విద్వేషం, విధ్వంసం, విషాదం మాత్రమే ఉన్నాయని నారా లోకేష్ ట్వీట్ చేశారు. వచ్చే రెండేళ్లలో ఏపీ సర్వనాశనం కావడం ఖాయమన్నారు. జగన్ రెడ్డి గారి మూడేళ్ల పాలన మూడు మాటల్లో.. విద్వేషం..విధ్వంసం..విషాదం. మూడేళ్లలో సాధించింది శూన్యం.. రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం ఖాయమంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
జగన్ రెడ్డి గారి మూడేళ్ల పాలన మూడు మాటల్లో.. విద్వేషం..విధ్వంసం..విషాదం. మూడేళ్లలో సాధించింది శూన్యం.. రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం ఖాయం.#3YearsForFailedCMJagan pic.twitter.com/L5TSK7Wl2y
— Lokesh Nara (@naralokesh) May 30, 2022
READ ALSO: Rakesh Tikait Attacked: రైతు నేత రాకేశ్ టికాయత్‌పై బెంగళూరులో దాడి... ముఖం, దుస్తులపై నల్ల సిరా..
READ ALSO: అచ్చెన్నాయుడిని గుడ్డలూడదీసి కొడతా.. వైసీపీ ఎమ్మెల్సీ ఓపెన్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook