Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా తుపానుగా బలపడే అవకాశముంది. రానున్న 48 గంటల్లో జరగనున్న ఈ పరిణామాలతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ముంపులో ఉన్న ప్రాంతాలకు మరింత సమస్య ఎదురు కానుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. ఈ క్రమంలో భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు విలవిల్లాడాయి. కృష్ణా నది పోటెత్తింది. బుడమేరు ముంచేసింది. విజయవాడ ఇప్పటికీ ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సాహం అందలేదు. తాగునీటికి, ఆహారానికి కటకటలాడుతున్న పరిస్థితి ఉంది. కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా మారనుంది.
ఆ తరువాత ఇదే అల్పపీడనం మరింతగా బలపడి తుపానుగా మారవచ్చని తెలుస్తోంది. వాతావరణ శాఖ ఇదే అంచనా వేస్తోంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారవచ్చని అంచనా ఉంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఆ తరువాత తుపాను ప్రమాదం పొంచి ఉంది.
ఈ తుపాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుపాను గండం పొంచి ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also read: Vijayawada Floods: వరదలో ఇళ్లు.. కళ్లల్లో కన్నీరు.. బెంబేలెత్తుతున్న బెజవాడ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.