AP Corona cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు- ఒమిక్రాన్ భయాలతో భారీగా టెస్టులు

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రికవరీలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 1,758గా ఉంది.

Last Updated : Dec 17, 2021, 08:42 PM IST
  • ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
  • ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో భారీగా టెస్టులు
  • 24 గంటల్లో మహమ్మారికి ముగ్గురు బలి
AP Corona cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు- ఒమిక్రాన్ భయాలతో భారీగా టెస్టులు

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి . కొత్తగా 127 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 33,050 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా ముగ్గురు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున మరణించినట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 180 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.

ఇక ఇప్పటి వరకు మొత్తం 3,09,28,798 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,75,546 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. ఇక ఇప్పటి వరకు 20,59,311 మంది కరోనాను జయించగా.. 14,477 మంది కొవిడ్​కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,758 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.

ఇప్పటికే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Also read: West Godavari Bus Accident: జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాకు కారణాలివే..!!

Also read: Vishakapatnam: అనుమానంతో భార్యను డంబెల్‌తో కొట్టి చంపిన భర్త-ఆపై సూసైడ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News